చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యి ఎన్నో సినిమాల్లొ నటించి మెప్పించారు స్టార్ కమెడిన్ ఆలీ..ఇప్పుడు వివాదాస్పదం అయ్యాడు. రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా కొందరు ఆయన్ను విమర్శిస్తూ ఉన్నారు.అలీ రాజకీయాల్లోకి వెళ్తే కచ్చితంగా అది పవన్ పార్టీలోకే అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే ఇచ్చాడు కానీ అది వైకాపా అవ్వడం అందరికి షాకింగ్ గా మారింది. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ కాకుండా అలీ వేరే పార్టీలోకి వెళ్తాడు.. వెళ్లాడు అంటూ విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.


ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మళ్లీ అలీ పై విమర్శల దాడి చేస్తున్నారు.ఇటీవల అలీ యొక్క కూతురు వివాహం జరిగింది. ఆ వివాహానికి చిరంజీవితో పాటు ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు అవ్వలేదు. అసలు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. అలీ యొక్క పిల్లల ను పవన్ చినప్పటి నుండి చూస్తూ ఉంటాడు. వారు అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా పవన్ కి ఉంది. అయితే అలీ ఆహ్వానించి ఉంటే కచ్చితంగా పవన్ పెళ్లికి హాజరు అయ్యేవాడు.


ఇకపోతే పవన్ ను కనీసం అలీ ఆహ్వానించక పోవడం తీవ్రంగా అవమానించడమే అంటూ సినీ జనాలతో పాటు పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు..మరో వైపు ఆలీ వైసీపి లో చేరడంతో కోపంతో ఆలీ వెళ్ళినా కలవడానికి ఇష్టం చూపించలెదని టాక్. పవన్ కళ్యాణ్ యొక్క మంచి మనసును అలీ అర్థం చేసుకోవాలని.. రాజకీయాల కోసం పవన్ వంటి ఆప్తుడిని అలీ దూరం చేసుకుంటున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను పెళ్లికి ఆహ్వానించక పోవడం కచ్చితంగా పెద్ద తప్పు అంటూ అలీ ని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు..మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: