కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఇలాంటి సక్సెస్ అందుకుందో మన అందరికి తెలిసిందే మరీ. కన్నడ భాషలో భూత కోల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని తన సొంతం చేసుకుంది.
దేశవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 450  కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.ఇలా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన  విజయాన్ని తన సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత గోపాలకృష్ణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇలా చేశారు.

ఈ సందర్భంగా సినిమా గురించి పరుచూరి మాట్లాడుతూ... ఈ సినిమా ఆత్మలకు సంబంధించినదని భావించాను అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి తాజాగా తాను కూడా కాంతర సినిమాని చూసానని అయితే ఇలాంటి ఓ గొప్ప సినిమాని థియేటర్లో చూడలేకపోయాను అనే భావన తనలో ఉందని  పరుచూరి ఇలా తెలిపారు.కర్ణాటకలో ఓ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా రిషబ్ శెట్టి గారు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం జమిందార్ విలన్ కాదు పోలీస్ ఆఫీసర్ విలన్ అనేలా చూపించే చివరికి అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారని  కూడా అయన తెలిపారు.

మన తెలుగులో వచ్చిన భూమి లాంటి చిత్రమే ఇది ఇందులో భూమి కోసం ప్రజలు పోరాటం చేశారు. అందులో భూత కోల కళాకారుడు  రూపంలో పోరాటం చేశారు. కథ స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటిలోపాలు లేవని ముఖ్యంగా హీరో తల్లి పాత్రలో నటించిన ఆమె నటనకు హ్యాట్సాఫ్ అంటూ పరుచూరి ఈ సినిమా గురించి ఇలా మీడియా కు వెల్లడించారు. ఆమె ఈ సినిమాలో నటించినట్లు ఎక్కడ కనిపించలేదు అడవిలో ఉండే అమ్మాయి ఈ పాత్ర పోషించారా అనే భావన కలిగేంత సహజంగా, లీనమై పోయారు.కథ కథనం స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడ ఎలాంటి లోపాలు అస్సలు లేకపోవడం వల్ల ఈ సినిమాకి మంచి ఆదరణ వచ్చిందని ముఖ్యంగా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉందని పరచూరి తన అభిప్రాయాన్ని  ఇలా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: