అమిగోస్: ప్లస్ & మైనస్ పాయింట్స్.. హిట్టా? ప్లాపా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన చిత్రం 'అమిగోస్ ' నేడు విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా వుందో.. ఆకట్టుకున్న అంశాలు ఏంటో తెలుసుకుందాం.నిజానికి ఈ సినిమా చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో కూడా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. మూడు విభిన్న పాత్రల్లో అలరించడానికి ఆయన తనవంతు విశ్వప్రయత్నం చేశాడు. అందులో విజయం సాధించాడు కూడా. అయితే.. మైఖేల్ అనే ఒక క్యారెక్టర్ లోనే ఆయన ఎక్కువ హైలైట్ అయ్యాడు. మంజునాధ్,సిద్ధార్ధ్ పాత్రలు రెగ్యులర్ గా వున్నాయి. సో అవి అంతగా ఆకట్టుకోలేదు.ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాధ్ అయితే అందంగా కనిపించింది కానీ.. హావభావాల విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా కీలకమైన సన్నివేశాల్లో కూడా ఆమె ఎలాంటి ఎమోషన్స్ కనిపించకుండా సైలెంట్ గా నిల్చుండిపోయింది. కేవలం గ్లామర్ కి మాత్రమే ఆమె సెట్ అయినట్టుంది. 


ఇక బ్రహ్మాజీ కామెడీ అయితే అక్కడక్కడా బాగానే వర్కవుటయ్యింది.ఇక సినిమా దర్శకుడు రాజేంద్ర రాసుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉండగా.. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తేలిపోయాడు. ఆసక్తికరమైన కాన్సెప్ట్ కు అంతే ఆసక్తికరమైన కథనం అనేది చాలా ఇంపార్టెంట్. 'అమిగోస్'లో అదే బాగా లోపించింది. ఆ కారణంగా చాలా ఆసక్తికరంగా మొదలైన సినిమా, చాలా నీరసంగా అయిపోతుంది. సో, దర్శకుడు రాజేంద్ర రెడ్డి  ఏదో కొంచెం పర్వాలేదనిపించుకున్నాడు.కెమెరా, మ్యూజిక్, గ్రాఫిక్స్ ఇంకా అలాగే ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ కూడా పర్వాలేదు అనే స్థాయిలోనే ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం బాగా రిచ్ గా ఉంది. అయితే అనవసరమైన సన్నివేశాలకు కూడా కాస్త ఎక్కువే ఖర్చు చేశారు.మొత్తానికి ఈ సినిమాకి కథ, కళ్యాణ్ రామ్ నెగటివ్ రోల్ హైలెట్ గా నిలిచాయి.ఈ సినిమా యావరేజ్ గా ఉందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: