కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో రకాల స్కీమ్ లలో పేదల కోసం కూడా పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైతే పదవీ విరమణ తరువాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగించాలని అనుకుంటారో, అలాంటి వారికి అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఆ స్కీమ్ ఏదో కాదు.. అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం లో చేరడం వల్ల ప్రతి నెల పెన్షన్ ను పొందవచ్చు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పి ఎఫ్ ఆర్ డి ఎ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారు ప్రతి నెల డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అయితే మీ వయసు ప్రాతిపదికన మీరు ఎంత డబ్బు చెల్లించాలి అనే అంశం మీద కూడా మీ పెన్షన్ ఆధారపడి ఉంటుంది..
అయితే ఈ స్కీమ్ లో ఏ వయసులో చేరినప్పటికీ 60 సంవత్సరాలు వచ్చే వరకు డబ్బులు కడుతూ ఉండాలి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో చేరినవారు రూ.1,000 నుంచి పెన్షన్ పొందవచ్చు. ఇందులో రూ.2,000 , రూ.3,000, రూ. 4,000, రూ. 5,000 వరకు పెన్షన్ కింద డబ్బులు తీసుకోవచ్చు. అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమంటే , మీరు ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి డబ్బులను కట్టుకోవచ్చు..
ఇంకా ఈ స్కీమ్ లో 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు , వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందడం కోసం ప్రతి నెల 42 రూపాయల నుంచి రూ .210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు 60 సంవత్సరాల తర్వాత ఐదు వేల రూపాయలను పెన్షన్ కింద పొందాలి అనుకుంటే, నెలకు 210 రూపాయలు పెన్షన్ కట్టాలి. అంటే సంవత్సరానికి 2,500 రూపాయలు చెల్లిస్తే , రూ.60 వేల పెన్షన్ వస్తుంది. 40 ఏళ్ళ వయస్సులో ఉన్నవారు ప్రతి నెల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ తీసుకోవడానికి నెలకు రూ. 291 నుంచి రూ. 1454 రూపాయల వరకు చెల్లించాల్సి వుంటుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి