అమెజాన్ సరికొత్తగా కస్టమర్లను ఆకర్షించేందుకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ,  నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ప్రారంభమైనది. అయితే ఇందులో ప్రముఖ బ్రాండెడ్ దిగ్గజాలు కూడా భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన వస్తువులపై భారీ తగ్గింపు తో 80% ఆఫర్ ను ప్రకటించింది. అయితే ఏయే వస్తువులతో ఈ ఆఫర్ వర్తిస్తుంది అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ  క్షుణ్ణంగా చదివి తెలుసుకుందాం.

అయితే ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ డే సెల్ అనేది.. ఎవరైతే అమెజాన్ లో సభ్యత్వం తీసుకుని ఉంటారో.. వారికి మాత్రమే అనగా ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి అన్నది గమనించాలి. అయితే ఇందులో వాషింగ్ మిషన్ లు ,ఐరన్ బాక్స్ లు, గ్యాస్ స్టవ్ లు , స్మార్ట్ టీవీ లు , స్మార్ట్ ఫోన్లు వంటి పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లను అతి తక్కువ ధరకే ఇవ్వడానికి సిద్ధం అయ్యింది.


ఇక అలాగే హోమ్ డెకరేటివ్ ప్రొడక్ట్స్, కిచెన్ ప్రొడక్ట్స్ పై  70 శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఇక 60% ఆఫర్ ను ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అందివ్వనుంది. ఇక నిత్యం వాడుకునే వస్తువులపై 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇకపోతే పాపులర్ బుక్స్ మీద 80% వరకు ఆఫర్ ను  ప్రకటించడం గమనార్హం. ఇక చేతి గడియారాలు మీద 70 శాతం, హెచ్డిఎఫ్ సీ,  బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు,  EMI  లపై 10 శాతం రాయితీ కూడా లభిస్తుంది. అంతేకాదు హెచ్డిఎఫ్సి బ్యాంకు కార్డు ద్వారా రూ.1750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే రేపు రాత్రి 12:00 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఇక ఇప్పటికే చాలా ఆఫర్లను వదిలిన అమెజాన్, ఇప్పుడు సరికొత్తగా  పెద్ద డిస్కౌంట్ లను  ప్రకటించడం ఇదే మొదటిసారి. మరి ఇంకెందుకు ఆలస్యం ..మీరు కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే తప్పకుండా ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: