మీకు కూడా పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే  తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసుకోవాలి.. పీఎఫ్ అకౌంట్ కలిగినవారికి లాయల్టీ బోనస్ బెనిఫిట్ వర్తిస్తుంది అని తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అలాంటి వారికి ఈ పీఎఫ్ ఖాతా గురించి చాలా చక్కగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెలా వచ్చే జీతంలో కోసం కొంత శాతం డబ్బు జమ అవుతున్న విషయం వారికి తెలుస్తుంది..కాబట్టి  దీని గురించి కూడా వారికి అవగాహన ఎక్కువే అని చెప్పాలి. ఉద్యోగి జీతంలో కొంత భాగం,  కంపెనీ కూడా కొంత భాగం చేర్చి ఉద్యోగి పిఎఫ్ ఖాతాలో జమ చేస్తూ వస్తుంటాయి.

ముఖ్యంగా ఉద్యోగి యొక్క జీతంలో 12 శాతం కట్ అవుతుంది కాబట్టి ఈ డబ్బు పిఎఫ్ అకౌంట్లో జమ చేయబడుతుంది. కంపెనీ కూడా ఉద్యోగి పేరు మీద 12 శాతం ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. ప్రతి నెలా జరిగే ప్రాసెస్ కాబట్టి డబ్బులు కూడా కట్ అవుతూ ఉంటాయి. ప్రతినెల పిఎఫ్ ఖాతా లో డబ్బులు కట్టిన వారికి ఉద్యోగి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడం తో పాటు ప్రతి నెలా పెన్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటు ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజనం కూడా లభించడం గమనార్హం.

ఇక బోనస్ కూడా లభిస్తుంది. ఇకపోతే పీఎఫ్ ఖాతా కలిగి ఉండటం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పీఎఫ్ ఖాతా కలిగిన వారికి 50 వేల రూపాయల వరకు బోనస్ లభిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఈ 50 వేల రూపాయల బోనస్ మీకు వర్తిస్తుంది. ఎందుకు అనగా 20 సంవత్సరాల పీఎఫ్ ఖాతా కు కాంట్రిబ్యూషన్ ఉండాలి కాబట్టి ఈ కాంట్రిబ్యూషన్ మొత్తం మీ ఖాతాలో జమ అవుతూ వస్తుంది. మీ బేసిక్ సాలరీ ని బట్టి ఈ కాంట్రిబ్యూషన్ సాలరీ కూడా మారుతుందన్న  మాట. ఒకవేళ మీకు బేసిక్స్ సాలరీ ఐదు వేల రూపాయలు అయితే రూ.30 వేల కాంట్రిబ్యూషన్ లభిస్తుంది. రూ.10 వేల వరకు సాలరీ ఉంటే రూ. 40 వేల రూపాయల కాంట్రిబ్యూషన్ లభిస్తుంది. అదే మీ బేసిక్ సాలరీ పది వేల రూపాయల కంటే ఎక్కువ అయితే రూ.50 వేల రూపాయల వరకు బోనస్ లభించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: