ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాలసీ ప్రాతిపదికన పాలసీదారులు పొందే ప్రయోజనాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే పాలసీ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త పడాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తుండగా వాటిలో ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లాన్ కూడా ఒకటి. ఈ పాలసీతో రోజుకు రూ.71 పొదుపుతో ఏకంగా రూ. 48 లక్షలకు పైగా ఆదాయం పొందవచ్చు.

ఎల్ఐసి అందిస్తున్న ఈ ఎండోమెంట్ ప్లాన్ గురించి మనం ఎప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందాం. ఈ పాలసీని 8 సంవత్సరాల వయసు ఉన్న వారి పేరు పైనుంచి కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు. గరిష్ట వయసు పరిమితి 55 సంవత్సరాలు అంటే యువత కెరియర్ ప్రారంభించిన వెంటనే ఈ పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్డ్ పీరియడ్ 12 సంవత్సరాలు నుంచి 35 ఏళ్లు ఉంటుంది. ఈ ప్లాన్ కొనుగోలు చేయాలని భావించేవారు నచ్చిన టెన్యూర్ ను  ఎంచుకోవచ్చు.  35 ఏళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు.

అదే 40 ఏళ్లకు పైగా వయసు కలిగిన వారు అయితే 12 సంవత్సరాల టెన్యూర్ ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు 18 సంవత్సరాల వయసులో ఉన్న వారు రూ.10 లక్షల మొత్తానికి ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే అప్పుడు వార్షిక ఆదాయం రూ.26,500 ఉంటుంది 35 సంవత్సరాల టెన్యూర్ కి ఇది వర్తిస్తుంది.  మెచ్యూరిటీ సమయంలో రూ.48 లక్షలకు పైగా రావచ్చు.  అంటే మీరు రోజుకు 70 రూపాయల పొదుపు చేస్తే సరిపోతుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఈ పాలసీ ద్వారా అధిక లాభం పొందవచ్చు. బీమా మొత్తం రూ.10లక్షలు,  బోనస్ రూ.15 లక్షలు, ఎఫ్ ఏ బి దాదాపు రూ.23 లక్షలు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: