
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఇలా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ చాలా అంటే చాలా ఆర్థిక ఇబ్బంది ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సామాన్యులు కూడా కొత్త బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారుగా రూ.5,812 కోట్లు గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ కింద సిలిండర్ కు 200 రూపాయలను ఎల్పీజీ అందిస్తోంది. దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ పథకం యొక్క బెనిఫిట్స్ పొందుతున్నట్లు తెలుస్తోంది.
దారిద్రరేఖకు దిగువనున్న ప్రజలకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఈ స్కీం కింద ఇస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీఫిల్, స్టవ్ ని ఫ్రీగా ఇస్తారట . అలాగే రూ.1600 ఆర్థిక సహాయం కూడా చేయబోతారు అని తెలుస్తోంది. 2016లో మోడీ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించగా 2021 ఆగస్టు 10వ తేదీన ఉజ్వల 2.1 మొదలుపెట్టింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మిగతా కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా ఊరట లభిస్తుందో లేదో చూడాలి.