ఈ కాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును నమ్మకమైన రాబడి కోసం వివిధ సాధనాలలో పెట్టుబడి పెడుతూ ఆదాయాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందరూ పెట్టుబడి అంటేనే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఆధారపడుతున్నారని చెప్పవచ్చు. ఈమధ్య కాలంలో bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లు పెంచడంతో అన్ని బ్యాంకులు కూడా ఒక్కొక్కటిగా వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరిలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వివిధ బ్యాంకులు కూడా వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఇకపోతే కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని బ్యాంకులు ముఖ్యంగా కొత్త వడ్డీ రేట్లు ప్రకటిస్తూ ఫిక్స్ డిపాజిట్ దారులకు ఊరట కలిగించాయి. ఇప్పుడు ఇదే కోవలోకి కెనరా బ్యాంకు కూడా వచ్చింది. కొత్త వడ్డీరేట్లను ప్రకటించింది. మార్చి 5వ తేదీ నుంచి కెనరా బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.  ఇకపోతే ఈ ప్రకటన మాత్రం ఆర్బిఐ మానిటరీ పాలసీ 2023 ముగింపుకు ఒక రోజు ముందు మాత్రమే ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఈ మార్పు ఎవరికి పెద్దగా తెలియలేదని చెప్పవచ్చు ముఖ్యంగా రెండు కోట్లలోపు ఫిక్స్ డిపాజిట్లు వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కెనరా బ్యాంకు.

ఇకపోతే సాధారణ ప్రజలకు నాలుగు శాతం నుంచి 7.25% వరకు వడ్డీ రేట్లు వర్తిస్తాయి.. అదే సీనియర్ సిటిజన్స్ కి అయితే 4 శాతం నుంచి 7.75% వరకు లభిస్తుంది. ఏడు నుంచి 45 రోజుల ఫిక్స్ డిపాజిట్ చేసిన వారికి వయసుతో సంబంధం లేకుండా 4.06 వార్షిక వడ్డీ లభిస్తుంది. అదే రూ. 15 లక్షలు పైబడిన డిపాజిట్లకు 5.41శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 180 నుండి 269 రోజుల డిపాజిట్ లపై సాధారణ పౌరులకు 6.40%, సీనియర్ సిటిజనులకు 6.75% వడ్డీ లభిస్తుంది. ఇకపోతే 10 సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ లపై సామాన్య ప్రజలకు 6.87 సీనియర్ సిటిజన్లకు 7.20% వడ్డీ లభిస్తుంది అలాగే టాక్స్ సేవ డిపాజిట్ స్కీం కోసం 6.7% వడ్డీ అందిస్తుంది కాబట్టి ప్రయోజనాలు పొందాలి అంటే గరిష్టంగా రూ.1.5 లక్షలు పెడితే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: