అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం లోని సెక్షన్ 10 ప్రకారం కొన్ని రకాల పనుల ద్వారా వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం, హిందూ అవిభాజ్య కుటుంబం లో వారసత్వం ద్వారా వచ్చే ఆదాయం, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ, గ్రాట్యుటీ పై పన్ను మినహాయింపు, వీఆర్ఎస్ ద్వారా వచ్చే డబ్బు, స్కాలర్ షిప్ లేదా అవార్డ్ ద్వారా వచ్చే ఆదాయానికి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. విద్యార్థులు తమ చదువు కోసం స్కాలర్‌షిప్ లేదా అవార్డు ద్వారా డబ్బులు సంపాదించినట్లు అయితే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు రూ.5 లక్షల వరకు వస్తే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు. ఇక కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంటే వచ్చే గ్రాట్యుటీ పై పన్ను ఉండదు. అలాగే ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ లోని డబ్బుల పై ప్రతి ఏడాది వడ్డీ వస్తుంది. వార్షిక వడ్డీ రూ.10 వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడే ట్యాక్స్ చెల్లించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి