కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం. ఇందులో భాగంగా రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి మూడు విడతల చొప్పున ఇప్పటివరకు 14 విడతల రూపంలో రైతుల ఖాతాలో డబ్బు చేరింది. ఇప్పుడు 15వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది.

ఈ పథకానికి సంబంధించిన 15వ ఇన్స్టాల్మెంట్ కి  అర్హులైన రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడానికి కేంద్రం సర్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మీరు కూడా పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులు అయినట్లయితే త్వరలోనే మీరు 15వ ఇన్స్టాల్మెంటును నేరుగా మీ ఖాతాలోకి పొందవచ్చు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన 14వ విడత డబ్బులను జూలై 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 15వ విడత నవంబర్ 30లోగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం.

మరొకవైపు ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.. కానీ 15వ విడత డబ్బుల గురించి ఈ వార్త రావడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే 15వ విడత డబ్బులు పొందాలనుకునే రైతులు కచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక దేశంలోని పేద రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రూ.2000 చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో 6000 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఇకపోతే నవంబర్ నెలలో ఈ డబ్బులు వస్తాయని తెలిసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: