రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను సైతం రూపొందిస్తూనే ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఎన్నో రకాల స్కీములను సైతం ప్రవేశపెడుతూ ఉంటుంది మోడీ ప్రభుత్వం.. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలలో PM కిసాన్ పథకం కూడా ఒకటి.. రైతులకు ఆర్థికంగా చేయూత నిచ్చే ఈ పథకం లో నగదు మొత్తాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై గత సంవత్సరం నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ దృష్టి మోడీ ప్రభుత్వం రైతులకు మరో రూ .2000 వేలు అదనంగా పెంచే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటి వరకు రైతులకు మూడు విడుతలలో రూ .6000 రూపాయలను అందిస్తున్నారు.. అయితే వెలుబడుతున్న నివేదిక ప్రకారం రైతులకు రూ .6000 నుండి రూ .8000 వరకు ఈ మొత్తాన్ని పెంచే విధంగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎనిమిది వేల రూపాయలను నాలుగు వాయిదాలలో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నారు.ఈ నివేదిక ప్రకారం లోక్  సభ ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది..


ఏప్రిల్ మే నెలలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో భాగంగా ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నదట. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారులకు 2000 రూపాయలు ప్రభుత్వం జమ చేస్తోంది.. 2019లో ప్రారంభమైన పిఎం కిసాన్ పథకానికి ఇప్పటివరకు 15 వాయిదాలు చెల్లించారు.. మరి ఇందుకు సంబంధించిన పూర్తి విషయాన్ని సైతం ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు.. అయితే ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా రైతుబంధు, రైతు భరోసా వంటి వాటిని పెంచే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏ ప్రభుత్వాలు ముందుగా తెలియజేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: