అరణ్య రిలీజ్ విషయంలో ఒకరకమైన కన్ఫ్యూజన్ మొన్నటిదాకా నెలకొంది. ఇప్పుడు దానికి చెక్ పెట్టేశారు. 2021 మకర సంక్రాంతి సందర్భంగా అరణ్యను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనూ ప్రచారం విస్తృతం చేశారు. మొన్నటిదాకా ఓటిటిలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపించిన ముంబై టాక్ కు భిన్నంగా ఎరోస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. అప్పటికంతా పరిస్థితి సద్దుమణిగి పోవచ్చు. పబ్లిక్ మునుపటి లాగే రెగ్యులర్ గా సినిమా హాళ్లకు రావొచ్చు. అందుకే అన్నీ ఆలోచించి పండగను సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.