అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న ప్రేమం సినిమాకు భారీ రేంజ్లో బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ లో లాభాల పంట పండుతుందట. అయితే సినిమా రిలీజ్ ముందే చైతు కెరియర్లో ఇలా ప్రాఫిట్స్ పొందటం ఇదే మొదటిసారి.. కెరియర్ మొత్తంలో ప్రేమం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇకపోతే మలయాళ ప్రేమం రీమేక్ గా వస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా అంతే భారీ విజయం అందుకుంటుందని బయ్యర్ల నమ్మకం.


అందుకే చైతు సినిమాను ముందే భారీ రేంజ్లో కొంటున్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను కాస్త మార్పులు చేర్పులు చేస్తున్నారట. కూడా మాత్రుక సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ లు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే సినిమాలో శృతి హాసన్ కూడా ఉండటం కలిసివచ్చే అంశం. అయితే సినిమా భారీ తనాన్ని చూస్తే ప్రేమం మీద అంచనాలు కూడా భారీగా ఉండేలా ఉన్నాయి.


ఇక ఫస్ట్ లుక్ తో ప్రేమం ను మరింత టచింగ్ గా తీసుకువచ్చారు. అయితే చైతు సినిమాల్లో ఇంత భారీ బిజినెస్ చేస్తున్న ఈ ప్రేమం సినిమా వచ్చి హిట్ అయ్యే దాకా కాస్త కంగారుగానే ఉంటుంది. ఎంత కాన్సెప్ట్ ఓరియెటెడ్ సినిమా అయినా చైతన్య స్టామినాకు మించి ఈ సినిమాను కొనేస్తున్నారట. అందుకే ఒకవేళ సినిమా హిట్ అయితే ఓకే కాని తేడా కొడితే మాత్రం చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. 


స్టార్ హీరో సినిమాల్లో కథ కథనాలు బాగా లేకున్నా ఫ్యాన్స్ అంతా ఒకసారి చూసేస్తే సినిమా యావరేజ్ గా అన్నా నిలుస్తుంది. మరి అక్కినేని వారసుడిగా వచ్చిన నాగచైతన్య అభిమానులను అలరిస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రేమం తో పాటుగా సాహసం శ్వాసగా సాగిపో సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. మరి ఈ రెండు సినిమాలతో చైతు స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటాడేమో చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: