యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘జనతా గ్యారెజ్’. ప్రస్తుతం ఈసినిమా కి సంబంధించిన షూటింగ్ సెట్స్ పై ఉంది. ప్యాచ్ వర్క్ లను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంటుంది. అలాగే ఈనెల 12న ‘జనతా గ్యారెజ్’ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ఘనంగా జరగనుంది. ఈ ఆడియో ఫంక్షన్ కి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నడూ జరగని విధంగా ‘జనతా గ్యారెజ్’ ఆడియో ఫంక్షన్ ని చిత్ర నిర్మాతలు జరుపుతున్నారు. ఎందుకంటే ఈ మూవీ దర్శకుడు ‘జనతా గ్యారెజ్’ ని పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కించారు. సామాన్యుడు కథాంశంతో నడిచే ఈ సినిమా సాధారణ ప్రేక్షకుడిని సైతం మెప్పిస్తుందనేది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్.

ఇక ‘జనతా గ్యారెజ్’ మూవీ ఆడియో ఫంక్షన్ కి కొద్ది గంటలే మిగిలి ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ నుండి వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ మూవీ థియోట్రికల్ ట్రైలర్ దుమ్ములేపింది అని అంటున్నారు. ఆడియో ఫంక్షన్ రోజు ప్లే అయ్యే ఈ ట్రైలర్ ఫంక్షన్ కి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.

కచ్ఛితంగా ‘జనతా గ్యారెజ్’ ట్రైలర్ తరువాత ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ జెట్ స్పీడులో దూసుకుపోతుందనేది ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్స్. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఈ ట్రైలర్‌ ని దాదాపు 10 వెర్షన్స్ లో రెడీ చేయించారు అని, ట్రైలర్స్ బాగుండటంతో జూనియర్ కి ఏది సెలక్ట్ చేసుకోవాలో కూడ అర్ధం కావటం లేదని కొందరు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: