కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సర్కార్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా సినిమా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.


దసరా సందర్భంగా సర్కార్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ అలా వచ్చిందో లేదో రికార్డులను సృష్టిస్తుంది. కేవలం 10 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. అంతేకాదు 2 మిలియన్స్ 20 మినిట్స్, 3 మిలియన్స్ 35 మినిట్స్ ఇలా రిలీజై 24 గంటలు గడువక ముందే 10 మిలియన్ (కోటి వ్యూస్)తో 1 మిలియన్ లైక్స్ తో విజయ్ స్టామినా చూపిస్తుంది.


టీజర్, ట్రైలర్ తో ఏర్పరిచే రికార్డులను లెక్క కడుతున్న ఈ టైంలో విజయ్ సర్కార్ మిగతా హీరోలకు ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వని విధంగా అంతర్జాలాన్ని అతలాకుతలం చేశాడని చెప్పొచ్చు. మురుగదాస్ టేకింగ్, విజయ్ మార్క్ యాక్షన్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తుండగా సినిమా తప్పకుండా వారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమాల వరుసలో నిలుస్తుందని అంటున్నారు.


2.ఓ 24 గంటల్లో 3.25 కోట్ల వ్యూస్ తెచ్చుకుంది. రజిని, అక్ష్య కాంబో సినిమా కాబట్టి 11 గంటల్లో కోటి వ్యూస్ సాధించింది 2.ఓ. ఇక ఆ తర్వాత విజయ్ మెర్సల్ సినిమా 24 గంటల్లో కోటి వ్యూస్ తెచ్చుకుంది. ఆ తర్వాత చిరంజీవి సైరా సినిమా టీజర్ 24 గంటల్లో కోటి వ్యూస్ తెచ్చుకుంది. మొత్తానికి విజయ్ 24 గంటల్లో లెక్క అదరగొట్టేలా ఉన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: