ఓటమిని కూడ అంగీకరించగల వ్యక్తిత్వం ఉన్నప్పుడే ఒక వ్యక్తి విజయాలకు దగ్గర కాగలుగుతాడు. ఓడిపోవడం ఎవరికీ నచ్చని విషయమే అయినప్పటికీ గెలిచిన వారిని ఓడినవారు అభినందించడం ఒక సాంప్రదాయం. నిన్న ‘బిగ్ బాస్ 3’ ఫైనల్ విజేత తెలిసిపోయిన తరువాత శ్రీముఖి రన్నర్ గా మారిన నేపధ్యంలో మొట్టమొదటిగా శ్రీముఖి చేత నాగార్జున మాట్లాడించాడు. 

శ్రీముఖి తన స్పీచ్ లో కనీసం రాహుల్ కు అభినందనలు కూడ తెలియచేయకుండా జనం ప్రేమతో టాప్‌ 2 వరకు వచ్చానని ఆ తర్వాత అంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటూ కామెంట్ చేసింది. దీనితో రాహుల్ తన సమర్ధతతో కాకుండా కేవలం లక్ తో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చాడా అన్న అర్ధం వచ్చేలా శ్రీముఖి మాటలు ద్వనించాయి. 

శ్రీముఖి ఈ షోలో చేసిన చాల ఓవర్ యాక్షన్ సీన్స్ ను ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు బుల్లితెర పై చూపించలేదు అన్నమాటలు ఉన్నాయి. వాస్తవానికి వాటన్నింటిని బుల్లితెర పై చూపించి ఉంటే శ్రీముఖి కనీసం టాప్ 5 లోకి కూడ వచ్చి ఉండేదికాదు అన్నది కొందరి భావన. అంతేకాదు శ్రీముఖి తనకు తానుగా బుల్లితెర పై తన అతితో యాంటి ఫ్యాన్స్ ను పెంచుకుంది అన్న కామెంట్స్ వినిపించాయి. పెరుగుతోన్న యాంటీ అంతా ఒకవైపు తిరగడానికి రెడీగా వున్న సమయంలో ఆమె స్వయంగా రాహుల్‌ని ఎంచుకుని అతడిపై దాడి మొదలుపెట్టింది. 

దీనికితోడు శ్రీముఖి ప్రవర్తనలో ఫేక్‌నెస్‌ ను కూడా బుల్లితెర ప్రేక్షకులు చివరి రోజులలో గ్రహించడంతో అనూహ్యంగా రాహుల్ కు పరిస్థితులు కలిసివచ్చాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంచి సింగర్ గా పేరున్న రాహుల్ ‘బిగ్ బాస్ సీజన్ 3’ విజేతగా మారడంతో ఒక ఏడాదిపాటు రాహుల్ అనేకచోట్ల స్టేజ్ షోలు చేస్తూ బాగా సంపాదించే ఆస్కారం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: