సంగీతానికి మాంత్రికుడు.. సరస్వతి పుత్రుడు ఈ గాత్రానికి ఆ తాళం వేయడం తెలిసిన వాడు రెహమాన్.. సంగీతానికి స్ఫూర్తిదాయకం రెహమాన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అలాంటి రెహమాన్ ఎప్పుడు ఏదోక ప్రదేశంలో తిరుతుంటాడు.. కాగా సంగీత ప్రోగ్రాం ల కన్న ప్రకృతి నీ ఆస్వాదిస్తున్నారు..ఈ నేపథ్యంలో ఆయన నెల్లూరు కి వచ్చారు.

 

ఇకపోతే ఈయన సంగీతం ప్రపంచ వ్యాప్తంగా పాకింది అన్న విషయం. సంగీత దర్శకులు ఈయనను సంగీత బ్రాహ్మ  అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు...ఆయన సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అయినా కూడా హిట్ పక్కా అవ్వాల్సిందే..అందుకే సినిమా దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యు లో ఉంటారంటే నమ్మండి...

 


సినీ సంగీత దర్శకుడు ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ శనివారం ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ప్రార్ధనలు చేశాడు. జిల్లాలోని  కసుమూరు దర్గాకి వచ్చిన ఆయన ఉదయం కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేన్‌ను కలిసాడు. ఆ తర్వాత తన కుమారుడు అమీన్‌తో కలిసి ఆదివారం ఉదయం మస్తాన్‌వలీ గంధోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ రెహమాన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు...


ఇకపోతే ఈ గంధోత్సవ కార్యక్రమానికి ఆయన ఏటా వస్తుంటారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి సాధారణ ప్రజలు, భక్తులు రెహమాన్‌‌ను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో కొంత గందరగోళం జరిగి సద్దుమణిగింది. గంధోత్సవంలో పాల్గొన్న అనంతరం ముజావర్, రెహమాన్‌ మిత్రుడైన సులేమాన్‌ ఇంటికి వెళ్లి కొద్దిసేపు విరామం తీసుకున్నారు. అక్కడ పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రెహమాన్ కొడుకుతో కలిసి చెన్నై వెళ్ళాడు..అవార్డ్ గ్రహీత రెహమాన్ ప్రస్తుతం చాలా సినిమాలకు సంగీత దర్శకుడుగా వ్యవహరి స్తున్నారు.. సినిమాలతో పాటుగా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కు మ్యూజిక్ అందిస్తున్నాడు.. తెలుగు, హిందీ, తమిళ్ తో పాటుగా సీరియల్స్ కు కూడా సంగీతాన్ని అందించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: