డాన్స్ విషయంలో అల్లు అర్జున్ కు పోటీ ఇవ్వడం చాల కష్టమైనా పని. ఒక విధంగా అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ గా మార్చింది అతడికి తన డాన్స్ పై ఉన్న పట్టు అన్నది ఓపెన్ సీక్రెట్. కేవలం బన్నీ స్టెప్స్ ను చూడడానికి వచ్చే ప్రేక్షులు ఎక్కువ. అయితే ఈమధ్య కాలంలో బన్నీ తన డాన్స్ పై శ్రద్ధ తగ్గించి తాను నటించే సినిమాల కథలలో వెరైటీ ఉండడానికి తాపత్రయ పడుతున్నాడు.

ఈ పరిస్థితులలో ఇప్పుడు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని ఒక పాటలో వెరైటీ స్టెప్స్ వేయబోతున్నట్లు సమాచారం. బన్నీ ‘అల వైకుంఠపురములో’ మూవీతో పోటీ పడుతున్న పరిస్థితులలో తన ‘సరిలేరు నీకెవ్వరు’ ఏవిషయంలోనూ వెనక పడకూడదు అన్న ఉద్దేశ్యంతో మహేష్ శేఖర్ మాష్టర్ ను రంగంలోకి దింపి అతడి చేత ఒక వెరైటీ స్టెప్ డిజైన్ చేయించినట్లు టాక్. 

వాస్తవానికి మహేష్ డాన్స్ లో వీక్ అన్న విషయం ఓపెన్ సీక్రెట్ ఈ విమర్శలకు బదులు ఇచ్చే విధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని ఒక పాటలో మహేష్ స్టెప్స్ చాల వెరైటీగా ఉంటాయి అని అంటున్నారు. శేఖర్ మాష్టర్ డిజైన్ చేసిన ఈ స్టెప్స్ ను మహేష్ రోజుకు రొండు గంటల చొప్పున ప్రాక్టీస్ చేసి ఇప్పుడు తన మూవీలో డాన్స్ మూమెంట్స్ ఇస్తూ తాను అన్ని విషయాలలోనూ సూపర్ స్టార్ అన్న విషయాన్ని తెలియ చేయడం కోసం చాల కష్టపడినట్లు సమాచారం. 

ఈ పాటలో మహేష్ వేసిన స్టెప్స్ చూసి ఈ మూవీ యూనిట్ సభ్యులు మాత్రమే కాకుండా కొరియో గ్రాఫర్ శేఖర్ మాష్టర్ కూడ చాల ఆశ్చర్య పోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బన్నీతో తాను పడుతున్న పోటీని మహేష్ ఏమాత్రం లైట్ గా తీసుకోవడం లేదని ‘సరిలేరు నీకెవ్వరు’ తో తనకు హ్యాట్రిక్ విజయం రావాలని మహేష్ పడుతున్న పాట్లు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: