ఇయర్ ఎండింగ్ వచ్చింది అంటే ఇయర్ మొత్తం రిలీజైన సినిమాలు.. ప్రేక్షకుడి మనసు మెచ్చిన సినిమాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. 2019 ఫ్లాష్ బ్యాక్ లో కంటెంట్ ఉన్న సినిమా అది కూడా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్నరథం పట్టారు. ప్రతి సంవత్సరం లానే 2019లో కూడా వందల కొద్ది సినిమాలు రిలీజైనా ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమాలు మాత్రం వేళ్ల మీద లెక్కబెట్టేలా ఉన్నాయని చెప్పొచ్చు. 

 

ముఖ్యంగా కోట్ల బడ్జెట్ ఉండదు.. కేవలం కంటెంట్ మీదే వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమాల గురించి ప్రస్థావిస్తే.. ఈ ఇయర్ చిన్నా పెద్దా అందరు మెచ్చిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాను స్వరూప్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ తో ఏర్పరచుకున్న క్రేజ్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

 

ఇక ఇదే కోవలో కేవలం కంటెంట్ బేస్ తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న మరో సినిమా బ్రోచేవారెవరురా. వివేక్ ఆత్రేయా డైరక్షన్ లో శ్రీవిష్ణు, నివేదా థామస్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. సహజత్వానికి దగ్గరగా ఉండే కథ కథనాలతో ఈ సినిమా హిట్ అందుకుంది. 

 

తెలుగు సినిమాలకు హాలీవుడ్ రేంజ్ తీసుకొస్తున్న యువ హీరో అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎవరు. తన ప్రతి సినిమాతో కొత్త ప్రయత్నం చేస్తూ వచ్చే అడివి శేష్ ఎవరులో కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి హిట్ అందుకున్నాడు.

 

ఇక పెళ్లైన తర్వాత కూడా సమంత చెలరేగిపోవడం గురించి తెలిసిందే. ఈ ఇయర్ ఆల్రెడీ నందిని రెడ్డి డైరక్షన్ లో వచ్చిన మజిలీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సమంత. నాగ చైతన్య కెరియర్ లో బెస్ట్ హిట్ గా మజిలీ నిలిచింది. ఇక మిస్ గ్రానీ రీమేక్ గా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ బేబీ సినిమా చేసింది సమంత. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

 

ఇక నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి చేసే నాని జెర్సీలో ఇంకాస్త ఎక్కువ ఇంప్రెస్ చేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చేలా ఉన్న ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: