టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు.  చిరంజీవి తర్వాత ఆయన పెద్ద సోదరుడు నాగబాబు ‘రాక్షసుడు’ మూవీతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు.  మొదటి సినిమతోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత ఒకటీ రెండు మూ వీస్ లో హీరోగా కూడా నటించారు. తర్వాత క్రమంలో నాగబాబు నిర్మాత గా మారారు.  రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీతో భారీగా నష్టపోయిన నాగబాబు అప్పటి నుంచి మళ్లీ నటన వైపు కి వచ్చారు.  తర్వాత అదృష్టం కలిసి వచ్చి జబర్ధస్త్ కామెడీ షో లోకి జడ్జీగా వెళ్లారు.  జబర్ధస్త్ లో ఏడేళ్ల పాటు జడ్జీగా కొనసాగిన నాగబాబు ఈ మద్య వేరే ఛానల్ కి వెళ్లారు.  ఇటీవల ఆయన రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. జనసే పార్టీ తరుపున గత ఏడాది పోటీ చేసి ఓడిపోయారు. 

 

అయితే తన తమ్ముడు పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీ గురించి ఎవరు కామెంట్స్ చేసిన తన యూట్యూబ్ చానల్ లో కడిగి పడేస్తున్నారు. తాజాగా నాగబాబు  భారీకాయం నుంచి స్లిమ్ గా ఆకర్షణీయంగా తయారయ్యారు. సన్నగా ఉండడమే ఆరోగ్యానికి మేలని ఆయన అంటున్నారు. తనకు బరువు తగ్గడానికి ఆరు నెలలు పట్టిందని.. దానికి సంబంధించిన మూడు ఫోటోలు కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇందులో బరువు తగ్గిన ఫొటోలతో పాటు అంతకు ముందు తాను లావుగా ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి.  

 

మెగాస్టార్ కుటుంబంలో నాగబాబు పొడువుగా.. మంచి పర్సనాలిటీతో ఉంటారు.  అయితే తాను ఇంత బరుడు తగ్గడానికి కారణం తగ్గడానికి ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడం.. వయసు, ఎత్తుకు తగ్గ బరువు మెయిన్ టెయిన్ చేయాలంటూ నాగబాబు తాను పాల్గొంటున్న షోల్లో నటీనటులకు సలహాలు ఇస్తుంటారు. అంతే కాదు.. తనకు బరువు తగ్గాలన్న సంకల్పం మరింత కలిగిందని అన్నారు. ఇతరులకు చెప్పేముందు తాను కూడా అనుసరించాలని నిర్ణయించుకుని బరువు తగ్గి ఆకర్షణీయంగా తయారయ్యారు. రోజుకు ఒక పూట మాత్రమే తింటూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేస్తానని నాగబాబు తెలిపారు. 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: