తెలుగు సినీ పరిశ్రమలో మనం ఎన్నో ప్రేమ వ్యవహారాలను చూస్తూ ఉంటాం. తెలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో హీరోలు ప్రేమలో పడ్డారు. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అని భావించారు. తమతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన వారి మీద హీరోలు ప్రేమలో పడ్డారు. కొందరు బయటకు చెప్పారు గాని మరికొందరు అసలు ఆ విషయాలను బయటపెట్టలేదు. కొందరు పెళ్లి చేసుకున్నా సరే ఆ తర్వాత విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో ఒక లవ్ స్టోరి మాత్రం బాగా వివాదాస్పదం అయింది. 

 

అదే ఆర్తి అగర్వాల్ తరుణ్ ప్రేమ వ్యవహారం. ఇది బయట మీడియాలో అంతగా హైలెట్ కాకపోయినా సరే వీరి మధ్య ప్రేమ వ్యవహారం మాత్రం ఒకప్పుడు సంచలనం అని అంటూ ఉంటారు. ఆర్తి అగర్వాల్ ని తరుణ్ పెళ్లి చేసుకుందాం అని అనుకున్నా సరే ఆమె మాత్రం ముందు వెనకడుగు వేసారు. ఆ తర్వాత ఆమె రెడీ గా ఉన్నా సరే తరుణ్ మాత్రం ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని తరుణ్ ని ప్రేమించిన తర్వాతే ఆమె కెరీర్ నాశనం అయింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. 

 

తరుణ్ తల్లి వారి ఇద్దరినీ విడగొట్టారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రహస్యంగా పెళ్లి చేసుకోవాలి అని చూసినా సరే ఆమె అడ్డు పడ్డారని ఆ పెళ్లి అవ్వనివ్వలేదు అని అంటూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది ఎవరికి స్పష్టత లేదు. వాళ్ళ పెళ్లి వ్యవహారం టాలీవుడ్ లో ఒక టాప్ హీరో కి కూడా తెలుసు అని కాని తర్వాత ఆ హీరో జోక్యం చేసుకుని వాళ్ళను విడగొట్టారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: