ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానే దాదాపుగా ఎక్కువ మంది సెలబ్రిటీలు తమకు సంబందించిన సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులు,ప్రేక్షకులతో షేర్ చేసుకుంటూ కొంత మేర పబ్లిసిటీని పొందుతున్నారు అనే చెప్పాలి. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం మనకు ఇటువంటివి ఏమి లేవు. కుదిరితే టీవీలో ప్రకటనలు, ఇంటర్వ్యూలు, లేదంటే పేపర్లు, పత్రికల ద్వారా ఇంటర్వ్యూలు ఇచ్చి తమ సినిమాలకు ప్రమోట్ చేసుకునే వారు. కానీ రాను రాను టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కడం ద్వారా అటువంటివి అన్ని కూడా పోయాయి. హాయిగా ఎవరికి వారు సొంతగా పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నారు. 

 

అయితే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ వినియోగించేటపుడు కొన్ని భద్రత చర్యలు తప్పక చేపట్టాలి, అదే సెలబ్రిటీలు అయితే మరింతగా గట్టిగా వాటిని పాటించవలసిందే. ఆ విధంగా పాటించకుంగా ఏమాత్రం కొంత అలక్ష్యం వహించినా చాలు తమ అకౌంట్స్ హ్యాకర్లు బారిన పడి సమాచారం అంతా గల్లంతవడంతో పాటు హాక్ చేసిన వాడు ఏది పడితే అది పోస్ట్ చేస్తూ ఉంటాడు.ఇక ఆ తరువాత దానిని తిరిగి పొందడం కొంత కష్ట సాధ్యం అని అంటున్నారు నిపుణులు. అయితే గతంలో ఈ విధంగా అక్కడక్కడా కొందరు సినీ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకర్ల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఘటనల తరువాత మిగతా వారు అందరూ కూడా గట్టిగా సేఫ్టీ టిప్స్ పాటించడం మరింత కఠినతరం చేసారు. 

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, బాలీవుడ్ లో సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంటి వంటి సినిమాల్లో నటించిన ఊర్వశి రౌతేలా నిన్న తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లుగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని, తన ఫేస్ బుక్ నుండి వచ్చే ఎటువంటి పోస్ట్ కు ఎవరూ కూడా స్పందించవద్దని ఆమె తన ఫ్యాన్స్ ని కోరింది. ఇక కాసేపటి క్రితం మరొక ట్వీట్ పెట్టిన ఊర్వశి, ఒక హ్యాకర్ కొంత డబ్బులు డిమాండ్ చేస్తూ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. కాగా ఆమె కంప్లైంట్ ని సైబర్ క్రైమ్ విభాగం వారిని పంపించడం జరిగిందని, అతి త్వరలోనే ఆమె అకౌంట్ ని హ్యాక్ చేసిన వారిని పట్టుకుంటాం అని ముంబై పోలీసులు ఆమె ట్వీట్ ని రీట్వీట్ చేయడం జరిగింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: