టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూరి జ‌గ‌న్నాథ్ సంచ‌ల‌నాల‌కు మారు పేరు. వ‌రుసగా ఎన్ని ప్లాపులు ఇచ్చినా స‌రే ఒక్క‌టంటే ఒక్క‌టి హిట్ తీస్తే చాలు మ‌ళ్లీ జ‌నాలు.. హీరోలు అంద‌రూ పూరి వెంట ప‌డిపోతుంటారు. ఇక ఆరేడు ప్లాపుల త‌ర్వాత రామ్ తో పూరి తీసిన ఇస్మార్ట్ శంక‌ర్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ హిట్ కొట్టాల‌ని తీవ్ర‌మైన క‌సితో ప‌ని చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌రో టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తో ఓ సినిమా ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. 

 

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు పూరి విజ‌య్ కు ఓ చిన్న పాటి వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా వ‌రుస ప్లాపుల‌తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. విజ‌య్ చివ‌ర‌గా న‌టించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమా సైతం డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే విజ‌య్ ఇప్పుడు ఒక హిట్ కొట్టి తానేంటో ఫ్రూవ్ చేసుకోవాల‌ని క‌సితో ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం పూరీతో చేసే సినిమా విష‌యంలో క‌థ లో ఇష్ట‌మొచ్చిన‌ట్టు కెలుకుడు వ్య‌వ‌హారం షురూ చేశాడ‌ని అంటున్నారు.

 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఈ కంప్లైంట్ ముందు నుంచి ఉంది. అస‌లు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమా ప్లాప్ అవ్వ‌డం వెన‌క కూడా విజ‌య్ కెలుకుడు వ్య‌వ‌హారం ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు పూరి సినిమా విష‌యంలో కూడా క‌థ‌లో వేలు పెట్టి కెలికేయ‌డం ఒక టి అయితే.. హీరోయిన్ తో ప‌లానా స‌న్నివేశంలో లిప్ లాక్ లు ఉండాల‌న్న కండీష‌న్లు కూడా పెట్టేస్తున్నాడ‌ట‌. దీంతో పూరికి చికాకు రావ‌డంతో పూరి కాస్త సుతిమెత్త‌గా విజ‌య్‌కు క్లాస్ పీకిన‌ట్టు చెపుతున్నారు. మ‌రి విజ‌య్ త‌న తీరు ఎప్ప‌ట‌కి మార్చుకుంటాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: