అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎంతో విచిత్రంగా ఉంటుంది. అన్నదమ్ములు ఎక్కువగా మాట్లాడుకోరు... మాట్లాడుకున్న అది తక్కువే. కానీ వీరిద్దరి మధ్య అనుబంధం మాత్రం ఎవరికీ కనిపించని విధంగా... కేవలం వారిద్దరికీ మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది . ఇలా అన్నదమ్ముల అనుబంధాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ సరి కొత్తగా పరిచయం చేసి... తెలుగు ప్రేక్షకులు అందరిని మెప్పించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా వచ్చిన విషయం తెలిసిందే. సీనియల్ హీరో విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

 ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్.. బంధాలను బంధుత్వాలను... తెలియజేస్తూ ఎంతోమందిని ఆలోచింపచేసింది ఈ  సినిమా. ఒక మనిషితో నవ్వుతూ మాట్లాడితే సరిపోతుంది ఆ మనిషికి అదే మనం ఇచ్చే బహుమతి అని చెప్పకనే చెప్పింది ఈ సినిమా. ఒక మనిషి పై కక్ష పెంచుకోవడం కంటే... చిరునవ్వుతో పలకరించడం ఎంతో గొప్ప అని ఒక మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. అంతే కాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలి అని  అందరికీ చాటి చెప్పింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. 

 


 ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో కనెక్ట్ అయింది అని చెప్పాలి. వెంకటేష్ మహేష్ బాబు ల  పాత్రలు అయితే అన్నదమ్ముల అందరికీ ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమా చూడడానికి ఎంతో  ఆసక్తి చూపుతుంటారు. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అని చెప్పారు. ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఫేవరెటే.

మరింత సమాచారం తెలుసుకోండి: