గత కొన్ని నెలలుగా సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుస్సాహసాలు తెరలేపి యావత్ భారతదేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. అయితే గతంలో గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ రోజు నుండి చైనా దేశం పై భారతీయుల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించారు. చైనా ఉత్పత్తులు గానీ అప్లికేషన్లు గేములు గానీ ఎవరు యూజ్ చేయకూడదని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారత
కేంద్ర ప్రభుత్వం చైనా అప్లికేషన్ల పై నిషేధం విధించింది.
ఇండియన్ క్రికెట్ టీం ఐపీఎల్ కూడా చైనీస్ మొబైల్ సంస్థ అయిన ఒప్పో ని ప్రచారం చేయడానికి అంగీకరించలేదు. ఇటీవలే బాగా ప్రాచుర్యం చెందిన పబ్ జి మొబైల్ ని కూడా
కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే యావత్ భారతదేశం మొత్తం చైనా ఉత్పత్తులను వాడకూడదని నిర్ణయించుకున్న వేళ కొంతమంది హీరోయిన్లు చైనా మొబైల్ ఫోన్లను ప్రచారం చేస్తూ సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. కరోనా కాలంలో షూటింగు లేక డబ్బులు రాకముందు ఏం చేయాలో తెలియక చివరికి చైనీస్ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి కొంత మంది హీరోయిన్లు పచ్చజెండా ఊపారు. చైనీస్ మొబైల్
ఫోన్ రియల్ మీ బ్రాండ్ ని హీరోయిన్లు బాగా ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రముఖ
సౌత్ ఇండియన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె అనేక ఉత్పత్తులను ప్రచారం చేశారు. ఇప్పటికీ అడపాదడపా కొన్ని ప్రకటనల్లో కనిపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆమె రియల్ మీ మొబైల్
ఫోన్ ప్రచారం చేశారు. రియల్ మీ ప్రో మూడు నిమిషాల్లోనే 13% చార్జ్ అవ్వగలదని... ఆ 13% చార్జింగ్ తో దాదాపు 3 గంటల పాటు మాట్లాడుకోవచ్చు అని ఆమె ప్రచారం చేశారు. కాజల్‌తో పాటు
నిధి అగర్వాల్, సోనమ్ బజ్వా, ఉర్వశి రౌతేలా,
ఇషా గుప్తా తదితరులు రియల్ మీ ని ప్రమోట్ చేస్తూ తమ సోషల్
మీడియా ఖాతాల్లో చిత్రాలను పోస్ట్ చేశారు.
ఐతే ఇది నెటిజన్లను రెచ్చగొట్టింది. వారు సరిహద్దులో చైనా దూకుడును గుర్తుచేస్తూ హీరోయిన్లను ట్రోల్ చేయడం ప్రారంభించారు.