
ఆర్‌ఎక్స్ 100 తో ఒక్క సారిగా ఈమె స్టార్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. తన అందాల తో ఈమె జోష్ తెప్పిస్తుంది. ఈమె టాలీవుడ్ సీనియర్ హీరోలతో కూడా నటించడం విశేషం. విక్టరీ వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి తన నటనతో ప్రేక్షకులని ఆకట్టేసుకుంది. ప్రస్తుతం పాయల్ తన కలనెరవేరింది అని మురిసి పోతుంది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంది.
తెలుగులో నటించడం ఒక ఎత్తైతే డబ్బింగ్ మరో ఎత్తు. కానీ ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పడం తన కల అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాబోతున్న సరి కొత్త సినిమా లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పానని సోషల్ మీడియా ఖాతా లో తన ఫోటోలని కూడా షేర్ చేసింది ఈ భామ. ఈ ‘నరేంద్ర’ సినిమాకి జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించనున్నారు. ఇది ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతుంది. ఒక కీలకమైన పాత్ర లో పాయల్ రాజ్‌పుత్ మెప్పించబోతోంది. మరి ఈ సినిమాని మనం చూడాలంటే మరి కొంత కాలం ఆగక తప్పదు. తన నటన, డబ్బింగ్ ప్రేక్షకులని పక్కాగా ఆకట్టుకుంటాయి. ఇందులో సందేహమే లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి