చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆలి కమెడియన్ గా మరైన రోజుల్లో అతనికి ఎంద చాట అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశారు డైరక్టర్ ఎస్వి కృష్ణా రెడ్డి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఆలికి ఒకే ఒక్క డైలాగ్ అది కూడ ఎంద చాట అని చెప్పించి సూపర్ అనిపించాడు.

ఇక అదే ఆలిని హీరోగా పెట్టి తీసి యమలీల తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఎస్వి కృష్ణా రెడ్డి. లేటెస్ట్ గా ఆలి టాక్ షోలో పాల్గొన్న ఆయన తన సినిమా ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు. హీరోగా అవ్వాలనుకున్న ఎస్.వి కృష్ణా రెడ్డి ఫోటోలు పట్టుకుని వేషాల కోసం తిరిగారట. ఇక లాభం లేదని డైరక్టర్ గా మారారు. ఎస్.వి కృష్ణా రెడ్డిలో ఎస్.వి అంటే ఏంటి సెంటిమెంట్ వినోదమా అని ఆలి అడిగితే అదే అంటూ నవ్వుతూ చెప్పారు ఎస్వి కృష్ణా రెడ్డి.  

ఇక తన పాత్ర చేట అంటే ఏంటి.. తనతో ఎంద చాట అనిపించి తనని చాట గాడిని చేశారని అన్నారు ఆలి. యమలీలలో మదర్ సాంగ్ కు స్పూర్తి ఏంటని అంటే.. అది తన మదర్ స్పూర్తితోనే కంపోజ్ చేశానని.. అప్పటికి ఆమె మరణించారని అన్నారు కృష్ణా రెడ్డి. ఎస్.వి కృష్ణా రెడ్డి ఏజ్ ఎంత.. 45, 55 అని ఆలి అంటే.. ఎస్.వి కృష్ణా రెడ్డి ఇంకా కొంచం పైకి.. ఇంకా కొంచం పైకి అన్నారు.. 65 అనగా ఇంకా కొంచం పైకి అంటే మీరేమైనా అమృతం తాగుతున్నారా అన్నారు ఆలి. ఫైనల్ గా 90 ఉంటాయా అండి అని అంటే ఎస్.వి కృష్ణా రెడ్డి బిగ్గరగా నవ్వారు.      

యమలీల సినిమా కోసం ముందు అనుకున్న హీరో ఎవరని ఆలి అడిగితే..  ఆ సినిమా చేస్తుండగా మేం చేస్తాం కదా అని పెద్ద స్టార్స్ నుండి కాల్స్ వచ్చాయని.. కాని నేను రాసుకున్న పాత్రకి అతనే పర్ఫెక్ట్ అనుకున్నా అని అన్నారు ఎస్వి కృష్ణా రెడ్డి. ఆ సినిమా పాత్ర ఇచ్చినందుకు నువ్వు నన్ను చాలా సార్లు చెప్పుకొచ్చావ్వు.. అది నీ కోసం రాసిన పాత్ర దానికి నువ్వు న్యాయం చేశావని ఆలితో అన్నారు కృష్ణా రెడ్డి. ఇలా ఆలితో సరదాగా చాట్ షోలో ప్రోమోతోనే వారెవా అనిపించేలా చేశారు. సెప్టెంబర్ 28న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది.  


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: