అలనాటి తారలు అన్నీ నేర్చుకొని చేసేవారు..వారు  ఎంత అందంగా ఉంటారో.. వారి నటన కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.. అందుకే అప్పటిలోని సినిమా స్టార్స్ కు అంత డిమాండ్ కూడా ఉంది.. డ్యాన్స్ తో ఆకట్టుకున్న వారి విషయానికి వస్తే.. భానుప్రియ, శోభన మొదలగు వారు అంతా కూచి పుడి , భరత నాట్యం లో ప్రావీణ్యం సంపాదించారు. వారు సినిమాలలో కూడా రాణించారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు.అయితే ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.


నటి శోభన మాత్రం  సోషల్ మీడియా లో అప్పుడప్పుడు పలకరిస్తుంది.. ఇకపోతే శోభన తాజాగా ఓ వీడియో ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా మరణించిన గాన గాందర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి నివాళులు అర్పిస్తూ ఒక పాటను  అంకితం చేసింది. ఎంతో చక్కగా ఆ పాటకు తగ్గట్లు నాట్యం చేసింది.  ఆ వీడియో ఫుల్ కామెంట్లు, లైకులతో సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు మరోక వీడియో ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది..


ఈ వీడియో లో ఆమె మరో భరతనాట్య కళాకారిణి తో కలిసి భరతనాట్యం చేస్తోంది. నాట్యంలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నామని తెలుపుతూ వీడియో ను షేర్ చేసింది.. ఆ వీడియో కొంచం ఫన్నీగా ఉండటంతో చూసిన వారంతా నవ్వక మానరు.. ఇలా కూడా కామెడీ చేయవచ్చా అని హాయిగా నవ్వుకుంటారు. అవును ఈ వీడియోలో ఆమె నాట్యం చేయకుండా.. మధ్య మధ్యలో ఆగుతూ మరో డ్యాన్సర్ చేస్తున్న వీడియో మూమెంట్స్ ను చూస్తూ తనకు నచ్చిన విధంగా డ్యాన్స్ చేసింది.  ఆ డ్యాన్స్ చూడటానికి కామెడీగా అనిపించింది. న్యూ డ్యాన్స్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేసింది..ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: