ఇక దాని తరువాత ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కొరటాల శివ తీస్తున్న ఈ మెసేజ్ ఓరిటెంటెడ్ కమర్షియల్ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని, తిరు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు, కుంభకోణాల నేపథ్యంలో దర్శకుడు శివ ఈ సినిమా తీస్తున్నాడని, అలానే ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ గా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది.
అదేమిటంటే, ఈ సినిమా యొక్క రన్ టైం ఎక్కువగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు సినిమా ఉందని, ఇకపై తీయబోయే మిగతా పార్ట్ కూడా మరొక గంటన్నర వరకు ఉంటుందని, మొత్తంగా చూసుకుంటే, ఫైనల్ గా సినిమా రెడీ అయ్యే సమయానికి రన్ టైం మూడు గంటలకు వరకు చేరవచ్చని అంటున్నారు. మరి నేటి కాలంలో రెండున్నర గంటలలోపే సినిమాలు వస్తున్న నేపథ్యంలో మూడు గంటల వరకు ఆచార్య సినిమా ఉంటె అది ఒకింత సినిమాకు ఇబ్బందికరంగా మారవచ్చని అంటున్నారు. అయితే ఆ రన్ టైం లో చాలా సన్నివేశాలు ఎంతో కీలకమైనవని, మరి వాటిలో ఏవైనా సీన్స్ తొలగిస్తారా లేదా అదే రన్ టైం తో రిలీజ్ చేస్తారా అనేది యూనిట్ కి కొంత ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి