టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ఆ మూవీతో ఊహించనంత పెద్ద డిజాస్టర్ ను చవిచూసారు. ఆ తర్వాత తన రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిన పవన్ ఎట్టకేలకు వకీల్ సాబ్ సినిమా ద్వారా మరొకసారి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్న పవన్, ఆ పై మరో మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టారు. ఇటీవల కొన్నాళ్లుగా ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం మీడియా కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా సినిమా హీరోల యొక్క రెమ్యునరేషన్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజానికి ఎక్కడ ఎటువంటి విపత్తు వచ్చినా కానీ సినిమా హీరోలు అందరికంటే ముందు ఉండి ప్రజలకు తమ వంతుగా సాయం అందిస్తున్నారని,  అలానే తమకు జీవితాన్నిచ్చిన ప్రజలను తమ వారిగా భావించి కష్ట సమయాల్లో ఎంతో కొంత విరాళాలు ఇస్తున్నారని అన్నారు. అయితే అందరి ఫోకస్ మా పైనే ఎక్కువగా ఉంటుందని నిజానికి సినిమా హీరోలకు వచ్చే ఆదాయం భారీగా కనపడుతుందని అన్నారు.

నిజానికి వారి పారితోషకాలకు ఎన్నో లెక్కలు ఉన్నాయని చెప్పారు పవన్. ఎవరైనా ఒక హీరో సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటున్నారు అనుకుంటే అతని చేతికి ఫైనల్ గా వచ్చేసరికి కేవలం 50 నుంచి 60 లక్షలు మాత్రమే వస్తుందని, మిగతా 40 లక్షలు మొత్తం టాక్స్ రూపంలో పోతుందన్న విషయాన్ని గుర్తు చేశారు పవన్. మరోవైపు ఎందరో ఎమ్మెల్యేలు అలానే ఎంపీల దగ్గర వందలాది కోట్ల రూపాయలు మూలుగుతున్నాయని అలానే వారు ఆ విధంగా డబ్బులు ఖర్చు చేస్తూ రాజకీయాల్లో పైపైకి ఎదుగుతున్నారుని కానీ ప్రజలు మాత్రం ఎక్కువగా సినిమా హీరోల పైనే ఫోకస్ పెడుతూ మాట్లాడుతారు అని అన్నారు పవన్. పైకి సినిమా వారు అలానే సినిమా హీరోల జీవితం ఎంతో గొప్పగా కనిపించినప్పటికీ లోలోపల వారు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలకు సమస్యలు వచ్చిన సమయంలో  ఎప్పటికప్పుడు సినిమా వారు ముందుకు వస్తూ  ఈ విధంగానే ఎప్పటికీ  సాయం చేస్తూనే ఉంటారని పవన్ చెప్పడం జరిగింది..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: