కోలీవుడ్ స్టార్ హీరో శింబు అక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నా సరే సినిమాల కన్నా వివాదాల్లో ఎక్కువ ఉండటం వల్ల కెరియర్ లో వెనకపడ్డాడు. అత్తారింటికి దారేది సినిమా తమిళ రీమేక్ భారీ అంచనాలతో తెరకెక్కినా అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా సుశీంద్రన్ డైరక్షన్ లో ఈశ్వరన్ సినిమా చేస్తున్నాడు శింబు. ఈ సినిమా ఫస్ట్ లుక్ దసరా సందర్భంగా రిలీజ్ చేశారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ డైరక్షన్ లో సినిమా అనగానే ఈశ్వరన్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక రిలీజైన ఫస్ట్ లుక్ కూడా క్రేజీగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో విలేజ్ గెటప్ లో శింబు సూపర్ గా ఉన్నాడు. చేతులో సర్పరాజుతో శింతు ఫస్ట్ లుక్ అదిరిపోయింది. చూస్తుంటే శింబు ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి కిక్ ఇచ్చేలా ఉందని అనిపిస్తుంది.

తమిళంలో సినిమాల కన్నా హీరోయిన్ తో ఎఫైర్స్ రిలేషన్స్ పెట్టుకోవడంలో ఇన్నాళ్ళు బిజీగా ఉన్న శింబు ఈమధ్య త్రిషతో పెళ్ళికి రెడీ అయ్యాడని వార్తలు వచ్చాయి. పండుగ సందర్భంగా శింబు సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈశ్వరన్ సినిమా కూడా ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ చేసింది. మరి ఈ సినిమాతో శింబు తన అసలు స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి. మన్మధ, వల్లభ సినిమాల టైం లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శింబు ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోవడంలో వెంకపడ్డాడు. మరి ఈశ్వరన్ సినిమా అయినా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేడో చూడాలి.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: