పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నడూ లేనంతగా వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు మరొక పీరియాడికల్ సినిమా కూడా చేస్తున్న పవర్ స్టార్, ఆ రెండిటి అనంతరం మరొక మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టారు. అలానే అవి మాత్రమే కాకుండా పవన్ తో సినిమా చేసేందుకు మరొక ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది.

దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ ఒక లాయర్ గా నటిస్తుండగా ఈ సినిమా నుండి ఇప్పటికే బయటకు వచ్చిన మగువ మగువ అనే పల్లవితో సాగె లిరికల్ సాంగ్ అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రెండూ కూడా మంచి స్పందన దక్కించుకున్నాయి. ఇక అలానే దానితో పాటు తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమాని క్రిష్ తీస్తున్నారు. ఇకపోతే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తదుపరి మరొక సినిమాని కూడా ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలతో కొనసాగుతున్న కొరటాల శివ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి సిద్దమయ్యారట. మిర్చి తో దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన కొరటాల, ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమా తీస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ కి ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ ని కొరటాల వినిపించారని, అది ఎంతో నచ్చిన పవన్, వచ్చే ఏడాది దీనిని పట్టాలెక్కిద్దాం అని చెప్పినట్లు టాక్. మరోవైపు మెగాస్టార్ ఆచార్య తరువాత అల్లు అర్జున్ తో ఒక సినిమా ఓకే చేసిన కొరటాల, అది పూర్తి అయిన వెంటనే పవన్ సినిమాని మొదలెట్టనునట్లు చెప్తున్నారు. కాగా ఈ సినిమాని టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించానుందని, మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగుల కలబోతగా దర్శకుడు కొరటాలసినిమా తీయనున్నాడని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక ఒకవేళ నిజమే అయితే మాత్రం, తొలిసారిగా పవన్, కొరటాల కాంబినేషన్ లో ఒక పవర్ఫుల్ సినిమా చూడవచ్చు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: