మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందళ్లు మొదలు కాబోతున్నాయి. ఈ నెల 9 న మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ పెళ్లి పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయనే చెప్పుకోవచ్చు. అయితే తన కూతురు పెళ్లి విషయాలను నాగబాబు ఓ మీడియా ద్వారా వెళ్లడించిన విషయం తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రకారం జరగనుందని ఆయన అందరికీ తెలియజేశారు.

అలాగే ఈ పెళ్లి ఉదయపూర్ లో ఉన్న ఉదయ్ విలాస్ ను వివాహ వేదికగా అలంకరించనున్నామని నాగబాబు తెలిపారు. డిసెంబర్ 9న రాత్రి 7:15 గంటలకు నిహారిక, చైతన్యల పెళ్లి జరగనుందని నిహారిక మామగారు అధికారికంగా తెలిపారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నింటినీ నిహారిక అన్నయ్య వరుణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడని నాగబాబు తెలిపాడు. అందుకే వరుణ్ కూడా షూటింగ్ కు బ్రేక్ వేసి మరీ తన చెల్లి పెళ్లి పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు.  

అయితే పెళ్లి ఇంకా ఏడురోజులే ఉందంటూ నిహారిక ఫుల్ కుషీగా ఉంది. అందుకే తనకు కాబోయే భర్తతో కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ఒక ఫోటో దిగి షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఏడు రోజులే మిగిలి ఉందంటూ పోస్ట్ చేసింది నిహారిక. ఇంకేముంది ఈ ముద్దుగుమ్మ ఫోటో సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ పెళ్లి దగ్గర పడుతుండటంతో పార్టీలతో రచ్చరచ్చ చేస్తోంది. పెళ్లి దవాత్ ను అందరికి ముందుగానే ఇస్తూ గోల గోల చేస్తోంది. 

ఈ మధ్యన నిహారిక తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో పార్టీ చేసుకుందని తెలిసిన విషయమే. అలాగే సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠితో కూడా పార్టీ చేసుకుంది ఈ బామ. అలాగే మెగా సోదరిమణులతోటి కూడా పార్టీ చేసుకుందట. వీరితో పాటుగా ఈ మధ్యన కాబోయే భర్త చైతన్యతోపాటుగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ బ్యూటీ క్వీన్ పార్టీ చేకుందట. ఈ వీటికి సంబంధించిన ఫోటోలను నెటిజన్లతో ఈ ముద్దుగుమ్మ పంచుకుంది. దాంతో ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: