
కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్-2. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథకు పార్ట్-2తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగింపునివ్వనున్నాడు. ఈ చిత్రంలో రవీనా టాండన్ రమీకా సేన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచిందనే చెప్పాలి. తల్లికిచ్చిన మాటకు కట్టుబడిన కొడుకు కథగా పార్ట్-2ను తెరకెక్కించారని టీజర్ చివర్లోని ఓ సన్నివేశం చెప్పకనే చెప్పింది.
ఇదిలా ఉంటే సినిమా దేశ వ్యాప్తంగా అనేక భాష్లలో విడుదల అవుతుండడం వల్ల ట్రైలర్‌ను వినూత్నంగా విడుదల చేశారు. సాధారణంగా ట్రైలర్ అంటే హీరో డైలాగ్‌లు, విలన్ వాయిస్ ఇవన్నీ వినిపించాలి. అయితే పలు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండడం వల్ల అన్ని ట్రైలర్లను కాకుండా.. అన్ని భాషలకు కలిపి ఒకటే విడుదల చేశారు. ఇందులో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ స్థాయిలో హిట్ కొడుతుందో చూడాలి.