జబర్దస్త్ షోలో కమెడియన్ల స్కిట్స్ తో పాటుగా అనసూయ, రష్మిల యాంకరింగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా చేసే అందాల ప్రదర్శన షోకి మంచి క్రేజ్ తెచ్చేలా చేస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ లో స్కిట్స్ ఎలా ఉన్నా అనసూయ, రష్మిల వల్ల షో చూసేందుకు ఇస్టపడతారు ప్రేక్షకులు. అంతగా వారి అందంతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఎలాగు మంచి పాపులారిటీ వచ్చిన షో కాబట్టి వారు కూడా అక్కడ ఫిక్స్ అయ్యారు. అయితే కమెడియన్లు అప్పుడప్పుడు యాంకర్ ల మీద పంచులేస్తూ ఉంటారు.

అనసూయ మీద అదిరిపోయేలా జోకులేస్తారు టీం లీడర్స్, రష్మి మీద కూడా రకరకాల పంచులు వేస్తుంటారు. స్కిట్ లో భాగమే అయినా కొన్నిసార్లు శృతి మించింది అనిపిస్తే మాత్రం వాళ్ల సైడ్ నుండి రియాక్షన్ ఘాటుగా ఉంటుంది. లేటెస్ట్ గా జబర్దస్త్ లో ఈమధ్య బాగా పాపులర్ అయిన ఇమ్మాన్యుయెల్ వేసిన పంచులకు రష్మి అతనికి రివర్స్ కౌంటర్ గా చెప్పు చూపించి మరి వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఇమ్మూ ఏం చేశాడని రష్మి అంత హర్ట్ అయ్యింది అంటే ఓ స్కిట్ లో భాగంగా ప్యూన్ గా చేసిన ఇమ్మాన్యుయెల్ కళ్లు కనిపించని వాడిగా చేస్తాడు. కెవ్వు కార్తిక్ స్కిట్ లో వర్షని పడేయాలని కళ్లు లేని వానిగా నటించే ఇమ్మాన్యుయెల్ రష్మి కలర్ తన కలర్ ఒకటే అంటాడు. దానికి రష్మి హర్ట్ అయ్యి చెప్పు చూపించింది.

అయితే ఇదంతా స్కిట్ లో భాగంగా సరదాగా సాగినా ప్రోమోలో మాత్రం ఇది హైలెట్ గా నిలిచింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ అయిన రష్మికి లైన్ వేస్తూ తన స్కిట్ లో ఆమెను భాగం చేస్తాడు సుడిగాలి సుధీర్. వీళ్ల లవ్ స్టోరీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆడియెన్స్ ఎలాగు ఎంకరేజ్ చేస్తున్నారని వీరు కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో రెచ్చిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: