రోజా... ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఈమె. ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యే హోదాలో ఉండి తెగ బిజీ అయిపొయింది. మరో పక్క ఈటీవీలో ప్రసారం అయ్యే  జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.  ఒకపక్క రాజకీయాలు, మరోపక్క బుల్లితెరను రెండిటిని సమానంగానే బ్యాలన్స్ చేస్తుంది. మధ్య మధ్యలో పండగలకి పబ్బాలకి ఈవెంట్స్ కూడా చేస్తుంది. మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తుంది ఈమె. రోజా అనుకున్నది అంటే చేసే తీరుతుంది. అందుకే రోజా అంటే దర్శక నిర్మాతలకి అంత నమ్మకం. రోజా 100 సినిమాలకు పైగా నటించింది కూడా. ఈమెకు అటు రాజకీయ పరంగా, ఇటు ఇండస్ట్రీ పరంగా కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. రోజాని అందరు ఇష్ట పడుతుంటే... మరి రోజాకి ఎవరంటే ఇష్టం అన్నా ప్రశ్న మీకు ఎప్పుడన్నా వచ్చిందా.. !!

ఇప్పుడు  రోజాకు యిష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న  ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం తెలిస్తే మీకు ఇంకా షాకింగ్ గా ఉంటుంది. తనతో కలిసి నటించిన  హీరోల పేర్లలో ఎవరో ఒకరి పేరు చెప్తుందేమో అనుకున్నారు కానీ ఇక్కడ ఎవరూ ఊహించని హీరో పేరు  చెప్పింది రోజా.  మరి మన రోజా మనసు అంతగా దోచేసిన ఆ హీరో ఎవరో తెలుసుకోండి.. ఆ హీరో మరెవరో కాదు  మాస్ మహరాజా రవితేజ. మీరు విన్నది నిజమే.  రవితేజ అంటే రోజాకి చాలా యిష్టమంట. మాస్ మహారాజ్ నటన అంటే రోజాకి చాలా ఇష్టం అని చెప్పింది. రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తుంటానని, ప్రతీ సినిమాను ఎంజాయ్ చేస్తానంటుంది రోజా. అలాగే  రవితేజలోని కామెడీ యాంగిల్ తనకు చాలా బాగా నచ్చుతుందని, ఆయన డైలాగ్ టైమింగ్ బాగుంటుందని, రవితేజ  కామెడీ చేస్తుంటే తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పింది రోజా. అంతేకాదు  రోజా చిన్నతనంలో  తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎక్కువగా అభిమానం అని.. కానీ ఇప్పుడు మాత్రం రవితేజ అంటే అభిమానం అంటుంది రోజా.  గతంలో వీరిద్దరూ కలిసి శంభో శివ శంభో, వీర, తిరుమల తిరుపతి వెంకటేష సినిమాలలో నటించారు.

 మన  రోజా మాత్రమే కాదండోయ్ రవితేజ అంటే మన  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా  చాలా యిష్టం అంట. తన అభిమాన హీరో రవితేజ నటించిన క్రాక్ సినిమాను బాగా  ఎంజాయ్ చేసానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.అలాగే  రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా రవితేజను అభిమానిస్తారు. మన మెగాస్టార్ తరువాత  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మెల్లమెల్లగా  స్టార్ హీరో రేంజ్ కి ఎదిగి, తనలోని మాస్‌ యాంగిల్ తో  ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రవితేజ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: