అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు... అంటే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే సన్నిహితులతో అన్నారట. గత కొన్ని రోజులుగా వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్న డమరుకం సినిమా నవంబరు 9న విడుదలవుతుందన్న గుసగుసలు వినిపించాయి. సరిగ్గా ఇదే రోజున విడుదలనున్న మరో భారీ చిత్రం క్రుష్ణం వందే జగద్గురం.
దాంతో, రెండు భారీ సినిమాలు బాక్సాఫీసులో తలపడితే రెంటికీ నష్టమే అని అంచనావేస్తున్నారు సినీ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ‘క్రుష్ణం వందే జగద్గురం’ టీమ్ ఓ సందర్భంలో నాగ్ ని అడిగిందట... సార్, డమరుకం నవంబరు 9న విడుదలవుతుందా అని. అప్పుడు నాగ్... విడుదల కాదు, మీరేం భయపడకండి అని చెప్పారట.
సో, డమరుకం మళ్లీ వెనక్కు వెళ్లిపోయిందన్నమాట. అసలింతకీ డమరుకం విడుదలవుతుందా అన్న సందేహాలకు నాగ్ సమాధానం ఆజ్యం పోసినట్టయింది. సో, బెస్టాఫ్ లక్ రానా.
మరింత సమాచారం తెలుసుకోండి: