సాధారణంగా సినిమా అంటే హీరోకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా కథ మొత్తం హీరో పై ఆధారపడి ఉంటుంది. కథలు రాసే రచయితలు కూడా హీరోను దృష్టిలో ఉంచుకొని కథలు రాస్తుంటారు. కేవలం కొంత పాత్ర మాత్రమే హీరోయిన్లకు కల్పించి కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. కానీ హీరోయిన్లు కూడా హీరోల కన్నా తామేమీ తక్కువ కాదంటూ సినిమా భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకొని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ అద్భుతమైన విజయాలను అందుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం...       

1) విజయశాంతి:(కర్తవ్యం, ప్రతిఘటన)  

విజయశాంతి నటించిన కర్తవ్యం మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక బ్లాక్ బస్టర్ హిట్ 1990లో ఓ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ గా అందరిని అలరించారు. అంతకన్నా ముందు 1986లో టి.కృష్ణ దర్శకత్వంలో విడుదలైన ప్రతిఘటన సినిమా మహిళ ప్రాధాన్యంతో తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

2) సుధా చంద్రన్ (మయూరి)

 భరతనాట్యం కారణంగా సుధాచంద్రన్ కారు ప్రమాదంలో తన కాళ్లను కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలు ద్వారా నాట్యం చేసి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది.మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుధాచంద్రన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సుధాచంద్రన్ కీలక పాత్ర పోషించడం. అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.

3) అనుష్క (అరుంధతి)

స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్లు రాబట్టిన అంత స్థాయిలో అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి కూడా అదే స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుష్క జీవితాన్నే మార్చేసిందని చెప్పవచ్చు.

4) జీవిత (అంకుశం)

కోడిరామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన అంకుశం సినిమాలో హీరో రాజశేఖర్, జీవిత నటించారు. ఈ సినిమాలో జీవిత పాత్రకే ఎంతో ప్రాముఖ్యత కల్పించారు దర్శకులు.

5) నయనతార (మయూరి)

లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మయూరి చిత్రంలో నయనతార నటించారు. హారర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.

6) నయనతార (అనామిక)
 
హిందీలో హిట్ సాధించిన కహానీ చిత్రం ఆధారంగా తెలుగులో రూపుదిద్దుకున్న మూవీ అనామిక. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార అనామిక గా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .

7) అంజలి (గీతాంజలి)
 
2014లో విడుదలైన గీతాంజలి చిత్రంలో అంజలి టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించింది. తన కెరీర్లో గీతాంజలి మూవీ ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు.

8) ఛార్మి (అనుకోకుండా ఒక రోజు)
 
ఎప్పుడూ గ్లామర్ సినిమాలో నటించే ఛార్మి మొదటిసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించి తన అద్భుతమైన నటన తో సినిమా లో హైలెట్ గా నిలిచింది. ఇలా ఛార్మి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించే సత్తా ఉందని నిరూపించుకుంది.

ఇలా చాలా మంది హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ప్రేక్షక ఆదరణ పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: