ప్రస్తుతం బుల్లితెరపై వంటలక్క అనే పేరు తెలియని ప్రేక్షకుడు లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సీరియల్ ను కూడా సినిమా కంటే ఎక్కువగా క్రేజ్ ఉంటుంది అన్న దానికి కార్తీకదీపం సీరియల్ నిదర్శనంగా నిలుస్తుంది. అయితే కార్తీకదీపం సీరియల్ వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ అసలు పేరు ఎవరికీ తెలియదు అందరికీ వంటలక్క గానే పరిచయం. అయితే తెలుగు బుల్లితెరపై వంటలక్క కు ఉన్న క్రేజ్ మరే ఇతర నటికి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రతిరోజూ కార్తీకదీపం సీరియల్ వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి టీవీ కి అతుక్కుపోతున్నారు
అయితే ఈ మధ్య కాలంలో కార్తీక దీపం సీరియల్ చూస్తూ ఉంటే ఈ సీరియల్ మరికొన్ని రోజుల్లో అయిపోతుందేమో అనే ఆందోళనలో అభిమానులు కనబడుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం వంటలక్కకు డాక్టర్ బాబు చేరువ అవుతుండటం.. వారి పిల్లలు కూడా చేరూవవుతున్నారు.. దీంతో కొన్ని రోజుల్లో సీరియల్ కి ఎండ్ కార్డు పడబోతుంది అన్న టాక్ సోషల్ మీడియా జోరండుకుంది. దీంతో అభిమానులు ఆందోళనచెందుతున్నారు. అయితే ఇప్పట్లో కార్తీకదీపం సీరియల్ కు ఎండ్ కార్డు పడటం కష్టమే అని అర్థమవుతుంది. మలయాళంలో 1450 ఎపిసోడ్స్ వచ్చింది కార్తీకదీపం సీరియల్. ఈ లెక్కన చూసుకుంటే 2017 లో ప్రారంభమైన ఈ సీరియల్ మరో ఆరు నెలలకు పైగా కొనసాగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పట్లో కార్తీకదీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడే అవకాశం లేదు.దాదాపు రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని మరో వైపు టాక్ వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి