అనుష్క : గ్లామరస్ పాత్రల నుంచి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల స్థాయికి ఎదిగిన నటి అనుష్క. తెలుగు, తమిళ పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగారు అనూష్క మొదట హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరో గా నటించిన "సూపర్ "మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి, బాహుబలి మూవీలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందింది.
సమంత : మొదట మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించిన సమంత అనతికాలంలోనే వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. హీరోయిన్ సమంత నాగ చైతన్య హీరోగా నటించిన "ఏం మాయ చేశావే" సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత వచ్చిన దూకుడు, ఈగ, బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.
సాయి పల్లవి : క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఫిదా" సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించి మొదటి సినిమాతోనే తన సత్తా చాటింది.సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి తెలుగులో ఢీలో, అలాగే తమిళ్ లో ఉంగలీల్ యార్ అడుత్త ప్రభుదేవా అనే టీవీ డాన్స్ షోలో అద్భుతంగా రాణించింది.
రకుల్ ప్రీత్ సింగ్ : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ దాదాపు టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితో నటించింది. రకుల్ తెలుగులో మొదటి సినిమా "కెరటం" తర్వాత "వెంకటాద్రి ఎక్స్ప్రెస్ "తో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది.
రష్మిక మందన : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన. నాగ శౌర్య హీరోగా నటించిన "చలో" మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తర్వాత వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ , సరిలేరు నీకెవ్వరు , భీష్మ ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లో నటించి అగ్ర కథానాయిక వెలుగొందుతుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి