పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలో బిజీగా ఉంటూ మరో పక్క ఇటు వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ పింక్ రీమేక్ "వకీల్ సాబ్" సినిమాతో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్ కావడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ కోసం బన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట.ఎందుకంటే వేణు శ్రీరామ్ బన్నీతో ఐకాన్ సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు. ఈ సినిమా చెయ్యాలంటే ఖచ్చితంగా పవర్ స్టార్ తో హిట్ కొట్టాలట.

ఇక వేణు శ్రీరామ్ విషయానికి వస్తే.. తన తొలి సినిమా ఓ మై ఫ్రెండ్ యావరేజ్ గా నిలవగా రెండో సినిమా ఎంసీఏ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇక ఆ తరువాత దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అనే సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది.అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న అల్లు అర్జున్సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐకాన్ సినిమా చేస్తాడా? లేదా? అనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి.


అయితే ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ సినిమా ఉందని ప్రకటన చేశారు. అయితే బన్నీ మాత్రం వకీల్ సాబ్ సినిమా హిట్ అయితేనే వేణు తో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడట. వకీల్ సాబ్ ఒకవేళ హిట్ కాకపోతే మాత్రం ఐకాన్ సినిమా ఆగిపోయినట్లేనని చెప్పవచ్చు. బన్నీ దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. ఇక చూడాలి "వకీల్ సాబ్" తో హిట్ కొట్టి బన్నీతో వేణు సినిమా చేస్తాడో లేదో. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: