విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఎఫ్2 చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా నటించగా.. వరుణ్ తేజ్ కి జంటగా మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా నటించి మెప్పించారు. హనీ ఇస్ ద బెస్ట్ అంటూ మెహ్రీన్ చిలిపి అమ్మాయి గా భలే ముచ్చటగా నటించి అలరించారు. ఇక తమన్నా తన హీట్ ఎక్కించే అందాలతో ప్రేక్షకులకు చెమటలు పట్టించారు. ఈ ఇద్దరు హీరోయిన్లు తమ అందాలను విపరీతంగా అరబోసి సెగలు పుట్టించారు. ఐతే ఎఫ్ 2 కి కొనసాగింపుగా వస్తున్న ఎఫ్3 లో వీళ్ళిద్దరితో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారట.
ప్రస్తుతం ఈ ఇంటరెస్టింగ్ అప్ డేట్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తోంది. లక్కీ బ్యూటీ రష్మిక మందన్న ఓ స్పెషల్ సాంగ్ లో సెక్సీ డాన్స్ చేయనున్నారట. ఈ ముద్దుగుమ్మ అనీల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఐతే తన సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన నటీమణులను.. తన తదుపరి చిత్రాల్లోని ఐటమ్ సాంగ్స్ కోసం అనీల్ సంప్రదిస్తుంటారు. రష్మిక ను కూడా ఆయన ఎఫ్ 3 మూవీ కోసం అడగగా.. ఆమె ఐటమ్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా.. `పండగ చేస్కో` `లెజెండ్`,`రూలర్` చిత్రాలలో కథానాయికగా నటించిన నటీమణి సోనాల్ ఎఫ్ 3 చిత్రంలో కనిపించనున్నారు. ఆమె కేవలం ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే నటిస్తున్నారని సమాచారం. ఐతే ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ అత్యంత కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎఫ్ 3 లో 4 హీరోయిన్లు నటిస్తున్నారనే వార్త ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్ 3 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమాకురుస్తున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి