అయితే సెప్టెంబర్ నెల లోపు 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ పూర్తి చేయాలని మహేష్ బాబు చిత్ర బృందాన్ని ఒత్తిడి చేస్తున్నారు. కానీ మళ్లీ కరోనా వ్యాప్తి చెందడంతో పరశురాం చిత్రీకరణ జరిపేందుకు సిద్ధపడడం లేదు. మూవీ యూనిట్ సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టేంతవరకూ షూటింగ్ నిలిపివేయాల్సిందే. ఐతే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ బాబు సినిమా విడుదల కానుంది. మహేష్ బాబు కి జంటగా మహానటి కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఎస్ తమన్ సంగీత బాణీలు సమకూరుస్తుండగా.. సంగీతానికి సంబంధించిన అప్డేట్స్ ఆగస్టు నెల నుంచి విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల ఇప్పటికే విద్యాసంస్థలపై ప్రభావం పడింది. అలాగే సినిమా థియేటర్లపై కూడా ప్రభావం పడుతోంది. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమాల కలెక్షన్ల పై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. కొందరు కరోనాతో మరణిస్తున్నారు. దీనితో ఈ మహమ్మారి తో మళ్ళీ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి