పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 3 ఏళ్ళ తరువాత  'వకీల్ సాబ్ ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.కాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ దాదాపు మూడేళ్ల తరువాత సినిమా వస్తే అది కాస్త ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే..పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం ఈ మధ్యనే విడుదలై 2 వారాలు అవుతుంది.'ఎంసియే' ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై దిల్ రాజు,బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణి కపూర్ లు కలిసి నిర్మించారు.ప్రకాష్ రాజ్, నివేద తామస్, అంజలి, అనన్యలు ముఖ్య పాత్రలు పోషించారు. యస్ యస్ తమన్ సంగీతం అందించాడు.అయితే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాకే వచ్చింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అలాగే ఏపీలో ఈ చిత్రం టికెట్ రేట్లు తగ్గించెయ్యడం వంటివి సినిమా కలెక్షన్ల పై దెబ్బ కొట్టింది.



ఇక ఈ సినిమా తాజా వసూళ్ల విషయానికి వస్తే..13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 84.36 కోట్ల షేర్ ను రాబట్టింది. 'వకీల్ సాబ్' చిత్రానికి దాదాపు 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 7-8  కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక తెలంగాణాలో థియేటర్ లు మూత పడి పోవటంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.ఇక అలాగే టికెట్స్ రేట్లు తగ్గడం కరోనా ఉధృతి పెరగడం వల్ల కూడా ఈ సినిమా స్వల్ప నష్టాలను చవి చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: