అదేంటి సొంత సినిమాకి ఎవరైనా అడంగల్ కలిగించుకుంటారా ? ఇదేదో నమ్మశక్యంగా లేని పని అనుకుంటున్నారా ?. నమ్మశక్యంగా లేక పోయినా ఇది నిజం. దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముందు లాక్ డౌన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ పెట్టమని చెప్పుకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా పలు సినిమాలు ఓటీటీ బాటపడుతున్న విషయం కూడా తెలిసిందే. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ కాక మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.



 ఇప్పుడు ఆ జాబితాలో శింబు, హన్సికలు జంటగా నటించిన ‘మహా’ సినిమా కూడా చేరింది. సుమారు నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో బై లింగ్యువల్ మూవీగా రూపొందింది. ఈ సినిమాకి యు.ఆర్. జమీల్ డైరెక్టర్ కాగా వి.మతియాలగన్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇప్పటికే ఆలస్యం అవుతున్న కారణంగా ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని నిర్మాత ఫిక్స్ అయ్యారు. కానీ దర్శకుడు మాత్రం సినిమా రిలీజ్ కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ సొంత సినిమాను ఇలా రిలీజ్ కాకుండా చూడాలని కోరడం వెనుక కారణం తనకు తెలియకుండానే సినిమాను పూర్తి చేయడమేనని దర్శకుడు జమీల్ అంటున్నారు. 




ఈ సినిమాలో కొంత భాగాన్ని తనకు తెలియకుండా కో-డైరెక్టర్తో షూటింగ్ చేయించారని, ఎడిటింగ్ కూడ తనకు తెలియకుండానే చేశారని, కథకు అవసరమైన కొన్ని సీన్స్ ఇంకా షూట్ కూడా  చేయలేదని పిటిషన్లో డైరెక్టర్ పేర్కొన్నారు. ఇవి కాక తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ ఇంకా పూర్తిగా చెల్లించలేదని, తనకు తెలియకుండా సినిమా పూర్తి చేసినందుకు తన రెమ్యూనరేషన్ తో పాటు మరో 10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కేసును విచారించిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలని నిర్మాతను ఆదేశిస్తూ తదుపరి వాయిదాను మే 19కి వాయిదా వేశారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: