
ధనవంతులకే సాయమా.. మిడిల్ క్లాస్ కనపడదా..?
సాయం చేస్తున్నా అంటూ కేవలం ధనవంతులనే పట్టించుకుంటున్నారని, మధ్య తరగతి వాళ్లకు సాయం చేయడం లేదని రేణూ దేశాయ్ ని విమర్శిస్తూ ఓ నెటిజన్ ఇన్ స్టా లో మెసేజ్ పెట్టాడు. తమ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నారని, మందులు లేవని, సాయం చేయాలని కోరిన ఆ నెటిజన్.. అంతలోనే మరో పోస్టింగ్ లో మిడిల్ క్లాస్ పేరెత్తి రేణూని విమర్శించారు. దీనిపై రేణూ దేశాయ్ స్పందించారు.
తనపై వచ్చిన విమర్శలకు సంబంధించి స్క్రీన్ షాట్ తీసి మరీ వాటిని ఇన్ స్టా లో పోస్ట్ చేసి రిప్లై ఇచ్చారు రేణు దేశాయ్. కొవిడ్ బాధితులకు సాయం అందించడంతో తలమునకలై ఉన్నానని, అనవసర మెసేజ్ లతో విసిగించొద్దని ఆమె రెండు రోజుల క్రితం కూడా కోరారు. అయినా కూడా ఆమెకి ఇలాంటి మెసేజ్ లు, తలనొప్పి తప్పడంలేదు.