హీరో నిఖిల్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చివరగా అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2 తోపాటు 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీర్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. `కుమారి 21 ఎఫ్` ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట. నిఖిల్ కోసం అలాంటి పాత్రనే సృష్టించాడట సుకుమార్. ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది. బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.



 “18 పేజెస్ నుంచి మరో చాప్టర్ ని రివీల్ చేసే టైమ్ వచ్చేసింది“ అని సదరు సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా గత నెల హీరో నిఖిల్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న కోవిడ్ మరణాలను చూసి తాను ఆవేశం, బాధ, అసహాయతకి గురయ్యాను అంటూ నిఖిల్ పేర్కొన్నాడు. గత రెండు మూడు వారాలుగా మాకు షూటింగ్‌లు అన్ని క్యాన్సిల్ కావడంతో అందరిలాగానే ఇంట్లో కూర్చొని కరోనా నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నానని నిఖిల్ అన్నాడు. అయితే ఖాళీగా కూర్చొకుండా తన మిత్రులు, ఎన్జీవోల ద్వారా తనకు తోచిన సహాయం చేస్తున్నట్లు అతను తెలిపాడు. అయితే ఇది ఏ మాత్రం సరిపోవట్లేదని నిఖిల్ అన్నాడు. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నాయని అతను బాధపడ్డాడు. అంతేకాక, మనల్ని ఎవరో వచ్చి కాపాడుతారు అనుకోవడం జరగని పని అని చెప్పిన నిఖిల్.. ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: