కోలీవుడ్ లో రజినీకాంత్, అజిత్, విజయ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ లో పెద్ద అగ్ర హీరోలుగా దూసుకుపోతున్న వీరి ముగ్గురికి తమిళ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగే వుంది.అయితే కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ పోటీని ఎంతవరకు ఛాలెంజింగ్ గా తీసుకుంటారో తెలియదు గాని వారి అభిమానుల్లో మాత్రం ఫ్యాన్ వార్ తారా స్థాయిలోనే జరుగుతుంది.తమ హీరోనే రికార్డులు సృష్టించి కోలీవుడ్ నెంబర్ వన్ హీరో అవ్వాలని బలంగా కోరుకుంటారు. అందుకోసం మిగతా హీరోల ఇమేజ్ ను దెబ్బకొట్టాలని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేసి వైరల్ చెయ్యడం వారికి అలవాటే. ఇక ఇద్దరి అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే వాతావరణం మామూలుగా ఉండదు. అయితే ఈసారి ఇద్దరు కాదు.ఏకంగా ఈ ముగ్గురు సినిమాలే విడుదల అవ్వబోతున్నాయి.


ఒకేసారి ఈ ముగ్గురు అగ్ర హీరోలు పోటీకి దిగడానికి సిద్ధమైనట్లు టాక్ వైరల్ అవుతుంది. రజనీకాంత్, అజిత్, విజయ్ వంటి కోలీవుడ్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ కు రెడీ అయినట్లు సమాచారం తెలుస్తోంది.సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నత్తే సినిమా ఈ ఏడాది దీపావళికి రానున్నట్లు ముందే క్లారిటీ ఇచ్చేశారు. శివ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు తల అజిత్ 'వాలిమై' కూడా దీపావళికి రానున్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమాకు హెచ్.వినోథ్ దర్శకత్వం వహిస్తున్నడు.ఇక ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోగా కొనసాగుతున్న విజయ్ 65వ సినిమా సైతం 2021 దీపావళికి రానున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా స్టార్ హీరోలు పోటీ పడితే అభిమానులను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: