సొంతం సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇది ఒక ఎవర్ గ్రీన్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.ఇప్పటికి యూత్ ని ఎంతగానో ఆకట్టుకునే చక్కటి కామెడీ సినిమా ఇది.2002 లో వచ్చిన ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు.దివంగత దర్శకుడు ఇవివి సత్య నారాయణ గారి పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన రెండవ సినిమా. రోహిత్ సెకండ్ హీరోగా నటించాడు. నమిత హీరోయిన్ గా నటించింది.


ఇక సునీల్, ఎమ్మెస్ నారాయణ,ధర్మ వరపు సుబ్రహ్మణ్యం,తనికెళ్ళ భరణి, శాంతి, చిత్రం శీను, హేమ, జయప్రకాశ్ రెడ్డి వంటి నటులు ఇందులో నటించారు. ఇక ఈ సినిమాలో పేరుకే ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ఈ సినిమాకి మాత్రం అసలైన హీరోలు ఎమ్మెస్ నారాయణ, సునీల్ అనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీళ్ళ కామెడీ ఒక రేంజిలో ఉంటుంది. సినిమా అంతా వీరి కామెడీతో ఆద్యంతం వినోదాత్మకంగా  సాగుతుంది. ఎక్కడ కూడా ఈ సినిమా అస్సలు బోర్ కొట్టదు.


ఇప్పటికి కూడా ఈ సినిమాని కేవలం వీళ్లిద్దరి కోసమే చూస్తారు. నిజంగా వీరిద్దరూ లేకపోతే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యుండేది కాదు. ఆ రకంగా తమ కామెడీని పండించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక సొలాంగ్ వ్యాలి సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా "జీహాద్" అనే సీన్. ఈ సీన్ లో ఎమ్మెస్, సునీల్ కామెడీ అయితే ఈ సినిమాకి నిజంగా గుండెకాయ అని చెప్పాలి. ఇక ఎమ్మెస్ నారాయణ చిత్రం శీనుతో చేసిన ఫోటో షూట్ సీన్, ఇంకా సునీల్ కాలేజీ సీన్స్, అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో చేసిన ఫారెన్ సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.ఈ సీన్స్ ఎంతలా హిట్ అయ్యాయంటే ఇప్పటికి కూడా ప్రేక్షకులని ఎంతగానో నవ్విస్తాయి.


ఇక సోషల్ మీడియాలో ఈ సీన్ల మీద వచ్చిన మీమ్స్ అన్ని ఇన్ని కావు.ఎంత ఒత్తిడిలో వున్న సొంతం సినిమా చూస్తే చాలు మనసులో వున్న బాధని అంతా మరచిపోయి తనివితీరా నవ్వుకుంటాం. ఇక ఈ సినిమాకి మరో హైలెట్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అని చెప్పాలి. ముఖ్యంగా దేవి కంపోజ్ చేసిన "తెలుసునా" అనే పాట అయితే ఇప్పటికి లేడీస్ కి హాట్ ఫేవరేట్. ఇక ఇప్పటికి ఎప్పటికి ఈ సినిమా ప్రేక్షకుల మదిలో ఎన్నడూ ఒక చక్కటి కామెడీ సినిమాగా నిలిచిపోతుంది.ఇక ఈ సినిమా నుంచి కొన్ని కామెడీ సీన్స్ మీకోసం.. చూసి మళ్ళీ నవ్వుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: